VSP: విశాఖలోని రుషికొండ బీచ్‌కి బ్లూ ట్యాగ్ రద్దు తర్వాత అధికారులు రంగంలోకి దిగారు. దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ బుధవారం రుషికొండ తీరంలో పర్యటించారు. బ్లూఫ్లాగ్ రద్దుకు గల కారణాలు తెలుసుకున్నారు. రుషికొండ బీచ్‌ను శభ్రంగా ఉంచాలని ఆదేశించారు. టూరిజం శాఖ అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆదేశించారు.