CTR: బాలాయపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని పలు రికార్డులను ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిధిలో గర్భిణుల వివరాల నమోదు, ఓపీ తదితర విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వేసవి ప్రారంభమవుతున్నందున నేపథ్యంలో ORS అందుబాటులో ఉంచుకోవాలన్నారు.