NLR: మనుబోలు మండలంలో నూరు శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని రాష్ట్ర PR&RD కమిషనర్ కృష్ణ తేజ అన్నారు. పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మార్చి నెలాఖరులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. మనుబోలు మండలంలో 50 శాతం పైగా ఇంటి పన్నులు చెల్లించి ఉన్నారన్నారు. గ్రామాలలో సంపూర్ణ పరిశుద్ధ్యానికి కృషి చేయాలన్నారు.