KMR: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనికిరాని ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫర్నిచర్, కంప్యూటర్లు, జిరాక్స్ మిషన్లు, టెంట్లు, ఇతర ఇనుప సామగ్రిని వేలం వేయనున్నట్లు SP రాజేశ్ చంద్ర బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 22న ఉ.10 గంటలకు పోలీస్ కార్యాలయంలో ఈ వేలం పాట నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు వేలంలో పాల్గొనాలన్నారు.