VZM: చీపురుపల్లిలో కొలువైవున్న శ్రీ కనక మహాలక్ష్మీ తల్లికి శ్రావణ మాసం నాలుగవ శుక్రవారం సందర్భంగా వివిధ రకాల పండ్లతో విశేషంగా అలంకరణ చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు బత్తాయి, యాపిల్ పల్లతో అలంకరణ చేపట్టి ఘనంగా కుంకమ పూజలు నిర్వహించారు. చీపురుపల్లితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు భక్తులు తల్లిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.