ASF: పదో తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాలో 100% ఉత్తీర్ణత సాధించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఇవాళ ప్రకటనలో ఆదేశించారు. ఇందులో భాగంగా MEO, HMలు విద్యార్థులపై దృష్టి సారించి, వెనుకబడిన వారికి అదనపు తరగతులు నిర్వహించాలన్నారు. స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచి, క్రమంగా పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు.