వరంగల్: నర్సంపేటలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఐదుగురు గాయపడ్డారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఓర్సు తిరుపతి, కొంగ మురళి కుటుంబాల మధ్య ఆస్తి తగాదా కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. మురళి కుమారుడు వినోద్ కుమార్ తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ, తిరుపతి తన అనుచరులతో కలిసి మురళి ఇంటిపై దాడి చేశారు. ప్రతి దాడిలో ఇరువర్గాలకు చెందిన ఐదుగురు గాయపడ్డారు.