HNK: శాయంపేట మండలం హుస్సేన్పల్లి గ్రామ BRS పార్టీ అధ్యక్షుడు నాగులగాని లక్ష్మణ్ రావు ఆ పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ మండల బాధ్యులకు అందజేసినట్లు వెల్లడించారు.