MHBD: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం బీహార్ రాష్ట్రానికి చెందిన సైకో హల్చల్ సృష్టించాడు. రోగులను బెదిరించి, ఆసుపత్రి వస్తువులను ధ్వంసం చేయడంతో భయాందోళనకు లోనయ్యారు. డ్రెస్సింగ్ రూమ్లో తలుపులు మూసుకుని గొంతు కోసుకోవాలని ప్రయత్నించిన ఆయనను సెక్యూరిటీ సిబ్బంది తలుపులు పగులగొట్టి అదుపులోకి తీసుకుని, వెంటనే వైద్య చికిత్స అందించారు.