KRNL: శ్రీశైలం సమీపంలోని TG పరిధిలో ఉన్న మన్ననూరు జంగిల్ సఫారీలో నిన్న సందర్శకులకు ఓ పెద్దపులి తారసపడింది. రహదారిపై నడుచుకుంటూ వస్తున్నపెద్దపులి దృశ్యాలను వారు జీప్లో నుంచి వీడియోలు చిత్రీకరించారు. మన్ననూరు సఫారీలో తరచుగా పెద్ద పులులు సందర్శకులకు కనబడటం పరిపాటిగా మారింది. నల్లమల పరిధిలో పెద్ద పులులు, చిరుతల సంతతి పెరిగిందని అధికారులు తెలిపారు.