SRD: సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని మున్సిపల్ కమిషనర్ శివాజీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నిధులు మున్సిపాలిటీలోని రోడ్లు, మురుగు కాలువలు, మౌలిక వసతుల కల్పనకు కేటాయిస్తామని చెప్పారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.