NZB: ఎముకలు కొరికే చలిలో ఇది నిజంగా చల్లటి కబురే. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చలి తగ్గింది. శనివారం రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలు నమోదైంది. నిన్న కూడా 18 డిగ్రీ లతో పెద్దగా చలి లేదు. రాబోయే మూడు రోజులు రాత్రి ఇదే తరహా అంటే 17 డిగ్రీల వరకూ నమోదయ్యి చలి తగ్గే అవకాశం ఉంది. మొన్నటి వరకూ 13 డిగ్రీల వరకూ పడిపోయి అంతా గజగజ వణికిపోయారు.