WGL: పర్వతగిరి మండలంలోని నారాయణపురం గ్రామంలో సోమయ్య ఇంటి నాటు కోడి గోలీల సైజులో గుడ్లు పెడుతూ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గత మూడు రోజులుగా పెడుతున్న గుడ్లు చిన్నవిగా ఉండటంతో యజమాని కుటుంబం ఆందోళనకు గురవుతున్నారు. చుట్టుపక్కల వారు పిట్ట గుడ్లలా ఉన్నాయని అన్నారు. తొలిచూరు కోళ్లు చిన్న గుడ్లు పెడతాయని పలువురు చెబుతున్నారు.