GDL: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్లాపురం గ్రామానికి చెందిన ఈరమ్మ, నర్సమ్మలకు చికిత్స నిమిత్తం రూ.28,000 సీఎం సహాయ నిధి చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను సోమవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు పాల్గొన్నారు.