NGKL: టీబీ వ్యాధి నిర్మూలనపై అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ గ్రామంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముక్తభారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య సిబ్బంది టీబీ వ్యాధి వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురిని పరీక్షించారు. 100% టీబీ వ్యాధి నిర్మూలించేందుకు ప్రజలు సహకరించాలన్నారు.