HYD: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. తిరుమలగిరిలోని బంజారానగర్ పార్కులో ఏర్పాటు చేసిన ఉమెన్స్ మేళాను ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. మహిళా సోదరీమణులు తమ ఇంటి వద్ద ఉత్పత్తి చేసిన వస్తువులు, వంటలు, గృహోపకరణాలను వారే మార్కెటింగ్ చేసుకోవడానికి ఈ మేళా ఏర్పాటు చేశారు.