WNP: భవన నిర్మాణ కార్మికులకు నిరంతరం ఆన్లైన్ సేవలు కొనసాగించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిక్సన్ డిమాండ్ చేశారు. గంధం మదన్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం వనపర్తిలో నిర్వహించారు. ఈ సమావేశంలో నిక్సన్ మాట్లాడుతూ.. సంక్షేమ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ నిధులను కార్మికులకు వెంటనే విడుదల చేయాలన్నారు.