ADB: బోరజ్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో శనివారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకోవడం పట్ల కలెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, MRO రాజేశ్వరి ఉన్నారు.