సత్యసాయి: దేవీ నవరాత్రుల్లో ఏడో రోజు ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గా మల్లేశ్వరీ ఆలయంలో అమ్మవారికి మంత్రి సవిత పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదాశీర్వచనంతో మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, తదితరులు పాల్గొన్నారు.