KRNL: రేబిస్ వ్యాధి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ పి.శాంతి కళ తెలిపారు.శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రేబిస్ వ్యాధి నివారణకు సంబంధించి గోడపత్రాలను ఆవిష్కరించారు. పెంపుడు జంతువులకు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయాలని, కుక్క కరిస్తే వెంటనే గాయాన్ని సబ్బుతో శుభ్రం చేసి ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు.