KRNL: ఆదివారం తెల్లవారుజామున ఆదోని కౌడల్పేటలో మున్సిపల్ అధికారులు తాగునీటి ఫ్లోరైడ్ పరీక్షలు నిర్వహించారు. ఫ్లోరైడ్ స్థాయి 0.4 పీపీఎంగా ఉందని తెలిపారు. కలుషిత నీరు కలవకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు నీళ్లు మరిగించి తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్బు, మాజీ కౌన్సిలర్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.