WGL: సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్గా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింత నెక్కొండకు చెందిన కుడికాల భవ్య నియామక ఉత్తర్వులను అందుకున్నారు. గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ కుడికాల వెంకటేశ్వర్లు కూతురు భవ్యకు అడిషనల్ కలెక్టర్గా ఉద్యోగం రావడంతో గ్రామస్తులు అభినందించారు. ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు.