W.G: నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో శనివారం న్యాయ సేవాధికార సంస్థ న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసాపురం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వి. నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ.. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అన్ని వర్గాల వారికి అందించే న్యాయ సేవలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.