ATP: తాడిపత్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో నవరాత్రుల 7వ రోజు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాల అనంతరం విశేష అలంకరణలో పార్వతీ దేవి దర్శనం ఇచ్చారు. పట్టణ, గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు.