HYD: నగరంలోని రెడ్ హిల్స్, నాంపల్లి, బహదూర్‌పుర, తిరుమలగిరి, అంబర్‌పేట, రామంతపూర్ ప్రాంతాలలో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ క్లీనింగ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో మ్యాను హోల్స్ నుంచి చెత్త చెదారం, దుప్పట్లు, దుస్తులు, తాళ్లు, చివరికి కుర్చీ సైతం బయటపడ్డట్లు అధికారులు తెలియజేశారు. ప్రజలు ఎలాంటి వస్తువులను డ్రైనేజీలో పడేయొద్దని కోరారు.