NZB: మోపాల్ మండలం కంజర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో చేపట్టిన పనుల గురించి ప్రధానోపాధ్యాయుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ. 11. 20 లక్షల నిధులు మంజూరు కాగా, తాగునీటి వసతి, విద్యుత్, ఫ్లోరింగ్ తదితర ప్రతిపాదిత పనులన్నీ పూర్తి అయ్యాయని హెచ్.ఎం గోపాలచారి తెలిపారు.