SRPT: ఫణిగిరి బౌద్ధ క్షేత్రం గొప్ప చారిత్రాత్మక ప్రాంతమని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి బౌద్ధక్షేత్రం గుట్ట కింద ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గుట్టపైన ఉన్న బౌద్ధ స్థూపచైత్యాలను, శిల్పాలను, విహార గదులు, శిల స్థావరాలు, బుద్ధుడి జాతక కథలు, మ్యూజియంలో భద్రపర్చిన స్థూపాలను, శిల్పాలను పరిశీలించారు.