BDK: జూలూరుపాడు మండలంలో ఈరోజు పర్యటనకు వచ్చిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌ను సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కమిటీ నాయకులు కలిశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇవ్వాలని, శాశ్వత మార్కెట్ నెలకొల్పాలని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు.