MDK: తూప్రాన్ పట్టణ పరిధిలో నర్సాపూర్ 161AA హైవే రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చివేశారు. శ్రీ లలితా పరమేశ్వరి ఆలయ వ్యవస్థాపకులు, దేవి ఉపాసకులు సోమయాజుల రవీంద్ర శర్మ సొంత ఖర్చులతో గుంతను పూడ్చివేశారు. కొద్దిరోజులుగా ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో, సొంత ఖర్చులతో పూడ్చి వేయించారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.