VKB: పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి వద్ద ఉన్న సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు స్టీల్ కరిగించే బట్టి పేలింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చెందిన మహ్మద్ అలీ (33) గాయాలపాలై, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో కార్మికుడు రషీద్‌తో పాటు పలువురికి స్వల్పగాయాలు అయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.