KMM: గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడ్డారని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. గురువారం నేలకొండపల్లిలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల హామీలో భాగంగా ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు రద్దు చేసి భూభారతిని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.