WNP:కొత్తకోటలో ఎస్సీ కాలేజ్ వసతిగృహం మంజూరు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం సెక్రటేరియట్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు ఆయన వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలేజీ వసతిగృహం మంజూరు చేసేందుకు మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.