KMM: కేదార్నాథ్ యాత్రకు వెళ్లిన భద్రాద్రి జిల్లావాసి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. అశ్వారావుపేటకు చెందిన వెంకటేశ్వరరావు ఈనెల 1న ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లారు. సోమవారం రాత్రి కేదార్నాథ్ చేరుకుని అక్కడే నిద్రించారు. మంగళవారం దర్శనానికి వెళ్లడానికి సహచరులు నిద్రలేపగా లేవలేదు. వైద్యులకు చూపించగా అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వారు చెప్పారు.