SRPT: కోదాడ పెద్ద చెరువు మత్స్యసహకార సంఘం ఎన్నికల నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. మొత్తం 55 నామినేషన్లు దాఖలు కాగా, డబుల్‌గా ఉన్న 5 నామినేషన్లను తిరస్కరించి 50 నామినేషన్లను ఆమోదించినట్లు ఎన్నికల అధికారి ఇందిరా తెలిపారు. వీటిలో ఎస్సీ కేటగిరీ నుంచి నలుగురు, జనరల్ కేటగిరీ నుంచి 46 మంది అభ్యర్థులు ఉన్నట్లు తెలియజేశారు.