NZB: బీజేపీ భావజాలాన్ని, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ తెలిపారు. బోర్గాంలో కొనసాగుతున్న బీజేపీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులు శుక్రవారం ముగిసింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికలు లేనప్పుడు సమాజంలో పార్టీ పని నిరంతరం జరిగే విధంగా చూడాలన్నారు. అన్ని అనుబంధ సంస్థలతో సమన్వయం ఏర్పరచుకోవాలన్నారు.