MNCL: మందమర్రి సర్కిల్ పరిధిలో గతంలో ప్రమాదాలు అధికంగా జరిగిన బ్లాక్ స్పాట్లను CI శశిధర్ రెడ్డి, SI రాజశేఖర్లు శుక్రవారం పరిశీలించారు. వాహనాల వేగాన్ని తగ్గించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లు, స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.