GDWL: నిన్న రాత్రి భారీ వర్షానికి ఉండవెల్లి మండలంలోని మారమునగాల గ్రామంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. అలంపూర్ మండలంలోని ఇమాంపురం మార్గం మధ్యలో చెట్లు రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. మానవపాడు మండలంలో సైతం చెట్లకొమ్మలు నెలకూలాయి. ఇదిలా ఉండగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యుత్ అధికారులు మరమ్మతు చర్యలు చేపట్టారు.