MNCL: తల్లిదండ్రులు విద్యార్థులను సమయానికి పాఠశాలలకు పంపాలని స్థానిక ఎంఈఓ శైలజ సూచించారు. సోమవారం లక్షెట్టిపేట్ మండలంలోని క్లబ్ రోడ్డు ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల ప్రగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎఫ్ఎల్ఏస్ ఎగ్జామ్లో విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచేలా ఉపాధ్యాయులు సిద్ధం చేయాలన్నారు.