BDK: దసరా పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఐటిడిఏ పిఓ రాహుల్ తెలిపారు. విజయానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ అందరికీ సుఖసంతోషాలు నింపాలని కోరుకున్నట్లు పీవో ప్రకటించారు. చెడుపై మంచి విజయం సాధించిన నేపథ్యంలో ఈ దసరా మహోత్సవం జరుపుకుంటామని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని అన్నారు.