BHNG: జిల్లాలో పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు మంగళవారం ప్రారంభమైన సందర్భంగా జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ కోనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరిశీలించారు. తరగతి గదిలో కూర్చొని విద్యార్థులతో పాటు పదవ తరగతి గణిత పాఠాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయుడి బోధనను పరిశీలించారు.