SRD: సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు ప్రాజెక్టులో వరద కొనసాగుతున్నట్లు ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీవర్ధన్ రెడ్డి ఆదివారం తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతమైన కర్ణాటక నుంచి 1506 క్యూసెక్కులు జలాలు వస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా వీయర్ ద్వారా అవుట్ ఫ్లో ఉందన్నారు. అయితే కుడి ఎడమ తూము కాలువల ద్వారా నీటి విడుదలను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.