MBNR: అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ వివరాలు.. పురపాలక పరిధిలోని ఏనుగొండ సరస్వతి దేవి గుడి కమాన్ ప్రాంతంలో ఓ వ్యక్తి చనిపోయి ఉన్న విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని జనరల్ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.