GDWL: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అలంపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ దొడ్డప్ప, వైస్ ఛైర్మన్ కుమార్ బుధవారం హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్‌లో కలిశారు. ఈ సందర్భంగా అలంపూర్ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బంది గురించి వివరించారు. ప్రధానంగా యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రైతుల అవసరాల మేరకు యూరియా సరఫరా చేయాలని వారు కోరారు.