KMR: నిజాంసాగర్ మండలం బ్రాహ్మణపల్లి అభయాంజనేయ స్వామి(ఏకశిల)సప్తమ వార్షికోత్సవ వేడుకలను రేపు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణకర్త పట్లోల్ల సునీత కిషోర్ కుమార్ తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మహాభిషేకం ఉంటుందని పేర్కొన్నారు. 108 నది జలాలతో అభిషేకం, మూలమంత్రం పావనము, తమలపాకులతో నాగవల్లి దళ ప్రత్యేక పూజలు చేస్తారు.