MDK: జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు 7 మండలాల్లో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నర్సాపూర్ మండలంలో అత్యధికంగా 93.38 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు ప్రకటించారు. మండలంలో 26,927 మంది ఓటర్లు ఉండగా, 12,260 మంది పురుషులు,12,883 మంది మహిళలు, ఇతరులు ఒక్కరుగా.. 25,144 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు.