HYD: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీపీ వీసీ సజ్జనార్ సమీక్షించారు. అసెంబ్లీ పరిసరాల్లో వెయ్యి మంది పోలీసులతో మూడంచల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. సమావేశాల దృష్ట్యా ప్రజలు గుంపులుగా తిరగొద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.