ADB: ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు సమయానికి చికిత్స అందకపోవడం వంటి కారణాల వల్ల తక్కువ బరువుతో పుట్టిన శిశువుల సంఖ్య పెరుగుతోందని కలెక్టర్ రాజర్షి షా ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గర్భిణీ, బాలింతలను గుర్తించి సమయానికి వైద్యపరీక్షలు చేయాలని వైద్యాధికారులకు సూచించారు.