WGL: వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలన పరమైన కారణాల దృష్ట్యా రద్దు చేస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి విషయాన్ని గమనించి నగర ప్రజలు ఫిర్యాదులు ఇచ్చుటకు బల్దియా కార్యాలయానికి రాకూడదని ఆమె ఆ ప్రకటనలో కోరారు.