వరంగల్ కమిషనరేట్ పరిధిలో బాలల పై లైంగిక నేరాలు (పోక్సో) కేసులు గణనీయంగా పెరిగాయి. 2024లో 364 కేసులు నమోదైతే, 2025లో 405కి చేరాయి. అమ్మాయిల పై వేధింపులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో షీ టీమ్స్ కేసులు 2024లో 243 నుంచి 2025లో 209కి తగ్గాయి. WGL జిల్లాలో నిర్వహించిన వార్షిక నివేదిక సందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ ఈ వివరాలు వెల్లడించారు.