ASF: ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గ్రామ పంచాయతీ నూతన – సర్పంచ్‌గా చునార్కర్ సతీశ్ బుధవారం రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక అధికారి శ్రావణ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సర్పంచ్ సతీశ్‌తో పాటు ఏడుగురు వార్డు సభ్యులు కూడా ప్రతిజ్ఞ చేశారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని, గ్రామాభివృద్ధే తన ప్రథమ ప్రాధాన్యతగా అందరిని భాగస్వాములను చేస్తానని తెలిపారు.